గ్రామ పంచాయతీ ముందు నిరసన
NEWS Dec 19,2024 06:19 pm
మల్యాల మండల కేంద్రంలోని మార్కండేయ గుడి సమీపంలో నిర్మిస్తున్న జియో సెల్ టవర్ మాకొద్దని కొత్తపేట కాలనీవాసులు గురువారం గ్రామపంచాయతీ ముందు బైఠాయించారు. సెల్ టవర్ వలన రేడియేషన్ ప్రాబ్లం ఉంటుందని, దీనివలన మాకు, మా పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మల్యాల ఈఓ శ్రీకాంత్ కు విన్నవించుకున్నారు. ఈ టవర్ నిర్మాణాన్ని ఇంతటితో ఆపకపోతే మేమంతా రాష్ట్ర సచివాలయం ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు.