విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందించిన ఎస్సై
NEWS Dec 19,2024 02:32 pm
మెట్‌పల్లి: విద్యార్థులు ప్రాథమిక దశ నుండే క్రీడల వైపు ఆకర్షితులు కావాలనే ఉద్దేశంతో మల్లాపూర్ మండల్ వేంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మెట్‌పల్లి ఎస్సై కిరణ్ కుమార్ 10,000 రూపాయల విలువైన క్రీడా వస్తువులు అందజేశారు. ఆయన తండ్రి చెన్నూరు రిటైర్డ్ హెడ్మాస్టర్ పబ్బ నారాయణ గౌడ్ జ్ఞాపకార్థం ఈ సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గ్రామస్తులు ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు.