సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టోల్ కాంట్రాక్టుపై సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం)ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.