అధికారం చేపట్టిన మొదటి ఏడాది లోనే రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2014-18 కాలంలో 4 దఫాలుగా రుణ మాఫీ చేస్తే వడ్డీలకే వాళ్లు ఇచ్చిన డబ్బులు సరి పోయాయంటూ ఎద్దేవా చేశారు. రైతుల ఖాతాలో అసలు అలాగే ఉండి పోయిందన్నారు. 2018-23 లో మళ్లీ లక్ష రుణ మాఫీ చేస్తామని చెప్పి చివరి సంవత్సరంలో గాలికి వదిలి వేశారంటూ ఆరోపించారు.