ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.