చిత్తూరు జిల్లా నిండ్ర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వినోద్ కుమార్ కుటుంబానికి ఏఎస్పీ రాజేశఖర్ సాయం చేశారు. ఎం. కళావతికి విడో ఫండ్ నుండి రూ. 50 వేలు, ఫ్లాగ్ ఫండ్ నుండి రూ. 25 వేల చెక్కులను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీస్ శాఖ తరపున వారికి అన్ని విధాల సహాయం అందిస్తామని, అన్ని ప్రయోజనాలు ఆలస్యం కాకుండా చూస్తామన్నారు.