కేంద్రం నియంతృత్వానికి నిదర్శనం
NEWS Dec 19,2024 08:14 am
రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రాజ్యాంగం పట్ల అగౌరవంగా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ముందు విపక్ష ఎంపీలతో కలిసి నిరసన నిర్వహించారు. బ్లూ కలర్ దుస్తుల్లో వచ్చి నిరసన తెలిపిన రాహుల్, ప్రియాంక గాంధీ. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.