మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ గా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాపై ఎందుకు ప్రశ్నించ లేదని నిలదీశారు. ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు. అంబేద్కర్ అవమానిస్తే చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. దీనిపై మీ వైఖరి ఏమిటో ప్రజలు తెలుసు కోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు మాజీ సీఎం.