మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇవాళ తిరుమల శ్రీివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులను పట్టించు కోవడం లేదని ఆరోపించారు. సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చే వారిని విస్మరించడం దారుణమన్నారు . గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఇకనైనా ఏపీ సర్కార్ తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.