బలగం మొగిలయ్య కన్నుమూత
NEWS Dec 19,2024 05:19 am
వేణు తీసిన బలగం చిత్రంలో గుర్తింపు తెచ్చుకున్న జానపద గాయకుడు మొగిలయ్య ఇక లేరు. కొంత కాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా తెల్లవారు జామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం దొగ్గొండి. తన భార్య కొమురమ్మతో కలిసి జానపద పాటలు పాడుతూ వచ్చారు.