మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి ఓంకార్ అఖిల్ పాముకాటుకు గురయిన ఘటన. కోరుట్ల ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లిదండ్రులు చేర్పించడంతో పాముకాటుగా వైద్యులు గుర్తించారు. చేతి నొప్పి వస్తుందని ఉపాధ్యాయులకు అఖిల్ తెలిపినా నిర్లక్ష్యం వహించారని తెలుస్తోంది. పెద్దాపూర్ స్కూల్‌లో ఇటీవల పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు చనిపోయిన ఘటన తెలిసిందే.