బాల్యవివాహ రహిత సమాజం కోసం కృషి చేయాలి
NEWS Dec 18,2024 04:51 pm
కంప్యూటర్ కాలంలో కూడా బాల్యవివాహాలు చేయటం బాధాకరమని, అలాంటి వివాహాలు లేని సమాజం కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా గళం విప్పి చెబితే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి అన్ని శాఖల తరఫున రక్షణ కల్పించేందుకు పనిచేస్తున్నాయని, చట్టాలు బాలల హక్కుల సంరక్షణ పనిచేస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై మాట్లాడారు.