పోయిన డబ్బులు తిరిగి బాధితుడికి అప్పగించిన సీఐ నిరంజన్ రెడ్డి
NEWS Dec 18,2024 09:33 am
మెట్‌పల్లి: డిసెంబర్ 7న 3 లక్షల రూపాయలు రోడ్డుపై పడి ఉండగా, స్థానికులు డబ్బును మెట్‌పల్లి సిఐ నిరంజన్ రెడ్డికి అప్పగించారు. ఈ విషయం తెలుసుకున బాధితుడు మెట్‌పల్లికి చెందిన హఫీజ్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన కూరగాయల వ్యాపారం కోసం కోరుట్లకు చెందిన ఎండి మోహిజ్ వద్ద నుండి తీసుకున్న 3 లక్షల రూపాయలు మార్కెట్ రోడ్డులో పోయినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో హఫీజ్ తన బ్యాగ్ నుండి డబ్బులు పడిపోయినట్లు ధ్రువీకరించుకొని, ఈరోజు వారికి డబ్బులు అప్పగించారు.