కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
NEWS Dec 18,2024 09:18 am
కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించి, మందుల నిల్వ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమందికి చికిత్సలు అందిస్తున్నారని వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యాధికారి సింధుజ ఉన్నారు.