అంబేద్కర్ విగ్రహానికి BRS నాయకుల వినతి
NEWS Dec 17,2024 01:02 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, లగచర్లకు చెందిన గిరిజన, దళిత, బడుగు బలహీన వర్గాల రైతులను జైల్లో పెట్టడంతో పాటు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని నిరసిస్తూ మల్యాల మండల బీఆర్ఎస్ నాయకులు మల్యాల కేంద్రంలోని బ్లాక్ ఆఫీసు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రైతన్నలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.