174 సైబర్ క్రైం కేసుల పరిష్కారం
NEWS Dec 17,2024 06:10 am
జాతీయ లోక్ అదాలత్ ద్వారా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదైన 174 కేసులను పరిష్కరించినట్లు ఇన్‌చార్జి సింధుశర్మ తెలిపారు.174 కేసుల్లో రూ.71,52,505 నగదును బాధితులకు ఇప్పించామన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ క్రైమ్ పరిధిలోని కేసుల పరిష్కారంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు