మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనిగట్టుకుని తెలుగు భాషపై దాడి జరుగుతోందని వాపోయారు. రాష్ట్రం విడి పోయాక తెలుగు భాషపై పట్టు వీడుతోందన్నారు. పాలకులు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని కానీ అసలైన భాష గురించి పట్టించు కోవడం లేదంటూ ఆవేదన చెందారు. విదేశీ ఉద్యోగం కోసం మాతృ భాషను మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.