డోకిపర్రు శ్రీవారిని దర్శించుకున్న సీఎం
NEWS Dec 14,2024 01:37 pm
పుణ్య క్షేత్రం డోకిపర్రు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్తలు పీవీ కృష్ణా రెడ్డి, సుధ దంపతులు సాదర స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి చిత్ర పటం, ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు. సుందరంగా తీర్చి దిద్దినందుకు అభినందించారు.