రత్నాపూర్ లో పర్యటించిన జువ్వాడి నర్సింగరావు
NEWS Dec 14,2024 03:27 pm
మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని శనివారం జువ్వాడి నర్సింగ్ రావు సందర్శించాడు. గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుద్దపెళ్లి మల్లయ్య, చర్ల సతీష్, వంజరి మల్లేష్ లను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు జలపతి రెడ్డి,రాజన్న, బాపురెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.