కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి 35వ వార్డులో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ ఆలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయుడిని దర్శనం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను సన్మానం చేశారు. ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు.