పత్తి కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
NEWS Dec 14,2024 06:01 am
పత్తి కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మద్నూర్ మండల కేంద్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లు, ధర, ఎన్ని రోజులకు డబ్బులు జమ అవుతున్నాయి అన్న విషయాలు తెలుసుకున్నారు. సీసీఐ కేంద్రంలో దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోళ్లు జరపాలన్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడినా, తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నా ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు.