14న లోక్ ఆదాలత్
NEWS Dec 13,2024 09:30 am
రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించు కోవాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ సునీత కుంచాల కోరారు..14న లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో 13 బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకుల రుణాలకు సంబంధించిన కేసులను పరిష్కరించు కోవడం ద్వారా ఇరు వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు