రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
NEWS Dec 13,2024 09:34 am
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోచారం, లక్ష్మి కాంతారావు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ రంగాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండి పడ్డారు.