ధర్మాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం
చేయండి: తపస్
NEWS Dec 13,2024 08:42 am
చిన్న శంకరంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మడూరులో పెండింగ్ లో ఉన్న డిఏ, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని హైదరాబాదులో ఈ నెల 17న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఉపాధ్యాయులను కోరారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవీందర్ రెడ్డి, మాధవి మహేష్, శ్రీహరి, ఆంజనేయులు, నరేందర్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.