తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
NEWS Dec 10,2024 05:43 pm
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మల్యాల మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మండల బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం శ్రీనివాస్, బద్దం తిరుపతిరెడ్డి, స్వామి, సురేష్, దశరథం, రవి, రాయమల్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.