లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
NEWS Dec 10,2024 05:44 pm
మల్యాల కేంద్రంలోని మహాలక్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం మండలంలోని 179 మంది లబ్ధిదారులకు గాను రూ.74,63,312 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.