ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
NEWS Dec 10,2024 05:16 pm
ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ తో కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని వీరి నలుగురి మధ్య కేసిఆర్ నలిగిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ అపోజిషన్ లీడర్ ఎందుకు అయ్యారని నిలదీశారు.