లోకేశ్‌తో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే భేటీ
NEWS Dec 10,2024 05:58 pm
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఏపీ మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి లోకేశ్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రితో కలిసి ఫోటో దిగారు. మంత్రి లోకేక్‌ను కలవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఎమ్మెల్యే అన్నారు. పలు అంశాలపై కొద్దిసేపు ముచ్చటించారు.