నవోదయ విద్యాలయ సాధన కమిటీ ఏర్పాటు
NEWS Dec 10,2024 08:56 am
కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని మల్లాపూర్ మండలంలో ఏర్పాటు చెయ్యాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సాధన కమిటీ ఏర్పాటు చేశారు. మల్లాపూర్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. అందరి సూచనలు, సలహాలు తీసుకొన్నారు. నవోదయ విద్యాలయాన్ని సాధించాలని తీర్మానించారు.