ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం భక్తుల తాకిడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉదయం నుండే ప్రత్యేక, ధర్మదర్శనాలకు బారులు తీరారు. దీంతో ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా ఆలంకరించి, సహస్ర నామార్చన, అభిషేకం, వేద పారాయణం నిర్వహించారు.