శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు
NEWS Dec 10,2024 05:04 am
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 67,124 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,069 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. విరాళాలు, కానుకల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుంది.