కర్ణాటకలో మూడు రోజుల సంతాప దినాలు
NEWS Dec 10,2024 04:50 am
మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు సీఎం సిద్దరామయ్య. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన మృతితో రాష్ట్రం గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. శాసన సభ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.