పోలవరం ప్రాజెక్టుపై సీఎం ఫోకస్
NEWS Dec 10,2024 02:57 am
వారం రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం పర్యటన తర్వాత వర్క్ షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తారని తెలిపారు.. జనవరి నుంచి డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపడతామని చెప్పారు. త్వరలోనే ఆర్ అండ్ ఆర్, భూసేకరణ పనులు కూడా పునః ప్రారంభిస్తామన్నారు.