తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసిందని సీఎం రేవంత్ తెలిపారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఈ 9 మంది కవులకు 300 గజాల ఇంటి స్థలంతో రూ. కోటి నగదు, తామర పత్రం అందిస్తాం. అని తెలిపారు.