కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలి రావాలి
NEWS Dec 09,2024 04:44 pm
హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి కామారెడ్డి జిల్లాలోని కురుమలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న కోరారు. సోమవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇల్చిపూరు శివారు సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కురుమల సమాయత్తపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కురుమలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్న అన్ని స్థానాల్లో సత్త చాటలన్నారు