ప్రజల ప్రతిబింబమే తెలంగాణ తల్లి
NEWS Dec 09,2024 02:45 pm
నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిబింబమే తెలంగాణ తల్లి విగ్రహమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ల కాలంలో ఒక కుటుంబం మాత్రమే బాగు పడిందని ఆరోపించారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించడం జరిగిందన్నారు సీఎం. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి టీఎస్ కు బదులుగా టీజీ అని అధికారికంగా ప్రకటించామని చెప్పారు .