ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ
NEWS Dec 09,2024 03:12 pm
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు శ్రీ రామలింగేశ్వర ఆలయ ఆవరణలో శ్రీ వినోద్ గురుస్వామిచే సామూహిక మహా పడిపూజ మహోత్సవం నిర్వహించారు. మాజీ సర్పంచ్, సన్నిధాన గురుస్వామి సరికెల లక్ష్మీ మహిపాల్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.