కరాటే విద్యార్థులకు డిఎస్పీ అభినందన
NEWS Dec 09,2024 12:35 pm
మెట్‌పల్లి: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బంగారు పథకాలు సాధించిన కరాటే విద్యార్థులను మెట్‌పల్లి డిఎస్పీ రాములు సోమవారం అభినందించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, బండలింగాపూర్‌కు చెందిన 13 మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించగా వారికి ప్రశంస పత్రాలు అందించారు. కరాటే శిక్షకులు ప్రవీణ్, వంశీ, నవీన్, పవన్, సురేందర్, గంగాధర్, వెంకటేష్ తదితరులున్నారు.