ఆశాలపై దౌర్జన్యం కేటీఆర్ ఆగ్రహం
NEWS Dec 09,2024 10:40 am
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఆశా సోదరీమణులు, తల్లులపై అకారణంగా పోలీసులు దాడులకు పాల్పడడాన్ని ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం అంటూ నిప్పులు చెరిగారు. మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యం చేయించడం దారుణమన్నారు. ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.