ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపిమూర్తి గెలుపు
NEWS Dec 09,2024 09:20 am
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి గెలుపొందారు. 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. అనంతరం గోపిమూర్తి కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి సీపీఎస్ ఉద్యమంలో పాల్గొంటానని, టీచర్ల సమస్యలను మండలిలో వినిపిస్తానని అన్నారు. టీచర్లు తనకు ఓటు వేసి డెమోక్రసీ బతికే ఉందని చాటారని ప్రశంసించారు.