రాజకీయ అవకాశాలు కల్పించాలి
NEWS Dec 09,2024 08:03 am
సంచార జాతులకు రాజకీయ అవకాశాలు లేకుండా పోయాయని, పార్టీలు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తిప్పిరిశెట్టి శ్రీనివాస్, సింగజోగి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంచార జాతి కులాలు బీసీల్లో 52, ఎస్సీల్లో 10, ఎస్టీల్లో 4 కులాలు ఉన్నాయని, జనాభా ప్రకారం బీసీల్లో 12 శాతం, ఎస్సీల్లో 20 శాతం, ఎస్టీల్లో 10 శాతం ఉన్నట్లు వివరించారు. సంచారజాతులను పట్టించుకునే నాథుడే లేడని, సంచారజాతులకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు.