మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో పోటీలు
NEWS Dec 09,2024 08:09 am
కామారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. 35 నుండి 75 ఏళ్ల వయసు కేటగిరిలో 10 కిలోమీటర్ల రన్నింగ్, షాట్ పుట్, తదితర ఈవెంట్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాక రవి ప్రసాద్ హాజరై క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాస్ మెడల్స్, బహుమతులు అందించారు.