మల్లాపూర్ పాఠశాల సందర్శించిన కలెక్టర్
NEWS Nov 28,2024 01:34 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సత్య ప్రసాద్ సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న బోజనంతోపాటు, స్టోర్ రూం లో నిల్వ ఉన్న వంట సరుకులను పరిశీలించారు. మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాము నాయక్, తహసీల్దార్ వీర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.