రేవంత్ చిత్రపటానికి గంగా జలాభిషేకం
NEWS Nov 27,2024 11:04 am
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేముల కుర్తి గ్రామంలో గల్ఫ్ కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గంగా జలాభిషేకం చేశారు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కార్మికులు అవిశ్రాంతంగా అనేకమైన పోరాటం చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 205 జీవో జారీచేసి గల్ఫ్ కార్మికులకు చేదోడు వాదోడుగా నిలిచారని అన్నారు.