జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులోని ప్రధాన రహదారిలో బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన లోకేశ్, రాహుల్ అనే యువకులు కోరుట్లలోని సాయిబాబా గుడికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం. జరిగిందని తెలిపారు. వీరిని అంబులెన్సులో జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.