పేదింటి బిడ్డకు అండగా ఎమ్మెల్యే
NEWS Nov 26,2024 12:22 pm
పేదింటి బిడ్డకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అండగా నిలిచారు. నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన కోరుట్ల పట్టణానికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ తుమ్మ రాజేశం కుమార్తె అక్షితను మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించి 30,000 రూపాయల విలువగల MBBS పుస్తకాలను ఆమెకు అందించారు.