న్యాయవాదుల విధుల బహిష్కరణ
NEWS Nov 26,2024 12:19 pm
నిజామాబాద్ కు చెందిన న్యాయవాది ఖాసీంపై దాడికి నిరసనగా మెట్ పల్లి పట్టణంలో మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వేణుగోపాల్, శ్రీనివాస్, వెంకట నరసయ్య, రాజ్ మహమ్మద్, యుద్ధ వీర్ తదితరులున్నారు.