నాణ్యమైన విద్యా బోధన అందించాలి
NEWS Nov 26,2024 12:16 pm
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. మెట్ పల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్, యూసప్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.