పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
NEWS Nov 25,2024 01:03 pm
మెట్‌పల్లి పట్టణంలోని ముస్లిం మైనారిటీకి సంబంధించిన పలు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. ఈ మేరకు హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కు వినతి పత్రం అందజేశారు.