మహబూబాబాద్‌లో కేటీఆర్ మహాధర్నా
NEWS Nov 25,2024 09:06 am
మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. రైతుబంధు, బీమా, 24 గంటల కరెంట్ వంటి పథకాలు కేసీఆర్ ఉన్నప్పుడే అమలయ్యాయని, రేవంత్ వచ్చిన తర్వాత రైతు పథకాలు నిలిచిపోయాయని విమర్శించారు. రేవంత్ ఆడబిడ్డలను మోసం చేశారని, రైతులను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రైతుల కోసం 119 నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తామన్నారు.